
మీ అకౌంట్లో పీఎం కిసాన్ నిధులు పడలేదా.. కారణాలు ఇవే!
జూన్ 20న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9.44 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ కింద రూ.18,880 కోట్లను విడుదల చేశారు. అయితే కేవైసీ, భూమి రికార్డుల్లో తప్పులు, ఆధార్-బ్యాంకు వివరాలు సరిపోలకపోవడం, తప్పుడు బ్యాంకు ఖాతా సమాచారం, అనర్హుల హోదా, జాబితాలో పేరు లేకపోవడం వంటి కారణాల వల్ల చాలామంది రైతులకు నిధులు అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ తప్పులను సరిదిద్దుకోవాలని రైతులకు సూచించింది. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేలు మూడు విడతల్లో అందిస్తారు.




