ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ (ఏకం) సంస్థ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ (విజయ్‌కుమార్) అంతిమయాత్ర భక్తుల కన్నీటి వీడ్కోలు నడుమ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగింది. సెప్టెంబరు 29న చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తులవల్లిలోని ఏకం క్షేత్రంలో మూడు రోజుల పాటు పార్థివదేహాన్ని భక్తుల సందర్శనార్థం ఉంచారు. శుక్రవారం జరిగిన అంతిమయాత్రలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు. అనంతరం భక్తుల నామస్మరణ మధ్య పార్థివదేహాన్ని మహా సమాధి చేశారు.