AP: కల్కి భగవాన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తిరుపతి జిల్లా బత్తలవల్లంలోని ఏకం క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, మంగళవారం తమిళనాడులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కల్కి భగవాన్ ప్రాణాలు విడిచారు. భక్తుల సందర్శనార్థం ఇవాళ్టి వరకు ఏకం క్షేత్రంలో పార్థివ దేహాన్ని ఉంచారు.