ఆధ్యాత్మిక గురువు విజయ్‌కుమార్ అలియాస్ కల్కి భగవాన్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, సాధారణ చికిత్స తీసుకుంటున్నారని కల్కి ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. సత్యవేడు మండలంలో ఆశ్రమం ఏర్పాటు చేసిన కల్కి భగవాన్.. అక్కడికి వచ్చే భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.