ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన నాగ్ అశ్విన్.. భారతీయ పురాణాల్లోని అంశాలతో భవిష్యత్ కథలను తెరకెక్కించేందుకు ఎంతో అవకాశముందని అన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ ఆ ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ‘కల్కి’ యూనివర్స్‌ను సృష్టించాలనుందని తెలిపారు. ప్రస్తుతం ‘కల్కి 2’ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.