ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురానుంది. మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక చేయూతగా ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని ఈ నెల 23న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. సెర్ప్, స్త్రీనిధి సంయుక్తంగా అమలు చేసే ఈ పథకం కింద రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు 4 శాతం పావలా వడ్డీతో రుణం అందిస్తారు. అదనపు ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు. గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించారు. డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలలు సభ్యత్వం ఉన్న మహిళలు అర్హులు. అవసరమైన పత్రాలు సమర్పించిన 48 గంటల్లోనే రుణం మంజూరు చేయనున్నారు.