‘కమలా పసంద్' యజమాని కోడలు ఆత్మహత్య

34322చూసినవారు
‘కమలా పసంద్' యజమాని కోడలు ఆత్మహత్య
ప్రముఖ పాన్ మసాలా కంపెనీలైన కమలా పసంద్, రాజ్‌శ్రీ పాన్ మసాలా యజమాని కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా ఢిల్లీలోని వసంత విహార్‌లోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులకు లభించిన సూసైడ్ నోట్‌లో ఆమె ఎవరినీ నిందించకపోయినా, 'ఒక బంధంలో ప్రేమ, విశ్వాసం లేనప్పుడు ఆ బంధంలో కొనసాగడానికి, జీవించడానికి కారణం ఏమిటి?' అని రాసి ఉంది. అయితే, దీప్తి తల్లిదండ్రులు అత్తింటి వారిపై ఆమెను ఆత్మహత్యకు పురికొల్పారని ఆరోపణలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్