ఆర్మూర్: అర్ధరాత్రి స్కూటీకి నిప్పు పెట్టిన దుండగులు

1534చూసినవారు
అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో గుర్తుతెలియని వ్యక్తులు లేడీస్ ఎంపోరియం దుకాణం యజమాని గటాడి నేహాకు చెందిన స్కూటీ (టీ. ఎస్ 16. డి. 0365)కి నిప్పంటించారు. నేహా తన దుకాణం మూసివేసి, ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీ నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ, స్కూటీ పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్