తెలంగాణలో మావోయిస్టులు లేరు: డీజీపీ శివధర్ రెడ్డి

553చూసినవారు
తెలంగాణలో మావోయిస్టులు లేరు: డీజీపీ శివధర్ రెడ్డి
తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. కర్రెగుట్టలోని పామూనూరు బేస్ క్యాంప్ సమీపంలో పోలీస్ ఔట్ పోస్టు, ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రమని, రాష్ట్రంలో మావోయిస్టులు లేరని, నక్సలిజాన్ని రూపుమాపడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉందని తెలిపారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్