
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ: బంగారం కూడా ఇవ్వాలని విజ్ఞప్తి
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలంలోని బెజ్జోర గ్రామంలో గురువారం కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులైన సుంకం మంజుల, ఎర్రోళ్ల పుష్పలకు సర్పంచ్ కార్తీక్, ఉప సర్పంచ్ లింబయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామ ప్రజల తరఫున మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆడపడుచులకు తులం బంగారం కూడా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిపిఓ సునీల్, అశోక్, వాడు సభ్యులు రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




































