బైక్ టైర్ లో చీర ఇరుక్కొని మహిళా మృతి

1297చూసినవారు
బైక్ టైర్ లో చీర ఇరుక్కొని మహిళా మృతి
నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలంలోని దూదిగాం వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బుస్సాపూర్ గ్రామానికి చెందిన కమల అనే వివాహిత మృతి చెందింది. భర్తతో కలిసి బైక్ పై వెళ్తుండగా, ఆమె చీర కొంగు వెనుక టైర్ లో చిక్కుకోవడంతో కింద పడి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను నిర్మల్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో బుస్సాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్