
కార్గో ఆటోలో ఆస్పత్రికి తరలింపు.. వ్యక్తి మృతి (వీడియో)
మధ్యప్రదేశ్‌లో గుండెల్ని పిండేసే ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రికి గుండెపోటు రాగా అంబులెన్స్‌కు ఆలస్యం అవడంతో కొడుకు కార్గో ఆటోలోనే ఆసుపత్రికి బయలుదేరాడు. తండ్రి ప్రాణం నిలబెట్టేందుకు దారి పొడవునా సీపీఆర్ చేశాడు. కానీ అంబులెన్స్ ఆలస్యం, ట్రాఫిక్ జామ్ ఆ వృద్ధుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి దారి ఇవ్వని ట్రాఫిక్, సకాలంలో స్పందించని వ్యవస్థపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




