కామారెడ్డి జిల్లా దోమకొండలోని గడి కోటలో మంగళవారం, తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐదు మండలాల సర్పంచులకు గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టి యు వి సి ప్రొఫెసర్ యాదగిరి రావ్ మాట్లాడుతూ, గ్రామాలలో సర్పంచులు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, డాక్టర్ రవి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం టి యు ఆధ్వర్యంలో జరిగింది.