
మేడారంలో భారీగా పెరిగిన చికెన్, మటన్ ధరలు
TG: మేడారం మహా జాతర సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దీంతో అక్కడి స్థానిక వ్యాపారులు డిమాండ్ ఉన్నవాటిపై ధరలు భారీగా పెంచేశారు. బయట కేజీ మటన్ ధర రూ.900-1000 ఉండగా.. మేడారంలో రూ.1500కి అమ్ముతున్నారు. ఇక కిలో లైవ్ కోడి బయట రూ.170 ఉండగా.. జాతరలో రూ.350కి విక్రయిస్తున్నారు. అలాగే మద్యం బాటిళ్లపై రూ.100 చొప్పున పెంచినట్లు సమాచారం. తోటల్లో నీడ కోసం వెళ్లే వారికి ఒక్కో చెట్టును రూ.1000-రూ.2 వేలకు అద్దెకు ఇస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు.




