కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణానికి చెందిన సాలంబిన్ ఈసాకు ఖతార్ లోని దోహలో ప్రతిష్టాత్మక ఐడియల్ ఇండియన్ స్కూల్ వార్షిక తహనీయతి మజ్లిస్ లో మీసాలీ ఉస్తాద్ ఆదర్శ ఉపాధ్యాయ అవార్డు శనివారం లభించింది. భారత రాయబారి డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి, ప్రథమ కార్యదర్శి హర్షిపాండే చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ
కాంగ్రెస్ పార్టీ నాయకుడు యండి. దావూద్ సాలంబిన్ ఈసాను అభినందించారు.