
‘జన నాయగన్’ వివాదం.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన సెన్సార్ బోర్డు
కోలీవుడ్ నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల విషయంలో వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ సినిమా విడుదల విషయంలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం ఇటీవల నిరాకరించింది. అయితే, మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అత్యున్నత న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దీని ద్వారా, నిర్మాతలు పిటిషన్ దాఖలు చేస్తే, ఎటువంటి ఉత్తర్వులు జారీ చేసే ముందు సీబీఎఫ్‌సీ వాదనను కూడా వినాలని కోర్టును కోరింది.




