
ఎదురెదురుగా ఢీకొన్న రెండు RTC బస్సులు.. నలుగురికి గాయాలు
AP: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాలివీడు మండలం అరవీడు వద్ద ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ తిరుమలయ్యతో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను గాలివీడు ఆసుపత్రికి తరలించారు.




