
DRDO హైస్పీడ్ రాకెట్-స్లెడ్ పరీక్ష విజయవంతం (వీడియో)
DRDO హైస్పీడ్ రాకెట్-స్లెడ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ(TBRL)లో గంటకు 800 కి.మీ. వేగంతో పరీక్షించింది. ఈ ఆధునిక ఎస్కేప్ వ్యవస్థ.. కానోపీ సెవెరెన్స్, ఎజెక్షన్ సీక్వెన్సింగ్, ఎయిర్‌క్రూ రికవరీలో పాసైనట్లు పేర్కొంది. ఇది భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించింది.




