
మహిళల ప్రపంచ కప్ ఫైనల్కు వాన గండం!
నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు అత్యుత్తమ ఫామ్లో ఉండటంతో హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్కు వాన గండం పొంచి ఉంది. అక్యూవెదర్ ప్రకారం, నవీ ముంబైలో 63% వర్షం పడే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, నవంబర్ 03 (సోమవారం) రిజర్వ్ డేగా ఉంటుంది. రిజర్వ్ డేనాడు కూడా వర్షం పడితే, ఇరు జట్లు ట్రోఫీని పంచుకోవాల్సి ఉంటుంది.




