
మహిళను వేధిస్తున్న వారిని అడ్డుకున్న యువకుడిపై దాడి
ఢిల్లీలో క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న మహిళను మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు వేధించారు. దీనిని గమనించి ప్రశ్నించిన వ్యాపారి ముకేశ్‌పై వారు కాళ్లతో తన్నుతూ, ఇటుకతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.




