కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ లోని పెగడ చెరువు నుండి సోమేశ్వర్ దేవుని కుంట వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర పూడికతో నిండిపోయిన సాగునీటి కాలువను రైతులు, గ్రామ సర్పంచ్ చింతల్ వార్ వీరేశం చొరవతో జేసీబీ సహాయంతో తొలగించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పూడిక తొలగింపుతో దేవుని కుంట చెరువులో నీరు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బీమ గంగారం, నాయకులు బింగి మొగులయ్య, బయ్యని కృష్ణ, బొప్పని మొగులయ్య, చింతల సాయిలు పాల్గొన్నారు.