కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ అరిగే ధర్మతేజ ఆధ్వర్యంలో రజక సంఘం అధ్యక్షుడు నగేష్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తిని సర్పంచ్ ధర్మతేజ గుర్తుచేశారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.