రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ను మరియు అదనపు కలెక్టర్ వారి కార్యాలయంలో కలిసి శనివారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ సంస్థకు సంబంధించిన భూములు కబ్జాకు గురికాకుండా చూడాలని కబ్జా చేసిన భూములను ఆగ్రోస్ సంస్థకు చేపట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు.