గణేష్ నిమజ్జనం వేలంలో లడ్డూ ప్రసాదాలు భక్తులకు దక్కిన అదృష్టం

0చూసినవారు
గణేష్ నిమజ్జనం వేలంలో లడ్డూ ప్రసాదాలు భక్తులకు దక్కిన అదృష్టం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లo లో శనివారం గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలంలో లడ్డూ ప్రసాదాలను పలువురు భక్తులు స్వీకరించారు. గ్రామ గణేష్ మండలి తరపున కురుమ శ్రీనివాస్ 21,511, శారదా మాత గణేష్ మండలి తరపున బడే రాజు 26,000, శ్రీ లక్ష్మీనరసింహ గణేష్ మండలి తరపున జంగం నర్సింలు 31,000, మున్నూరు కాపు గణేష్ మండలి తరపున చిట్టెంపల్లి శరత్ 25,000, మున్నూరు కాపు బాల గణేష్ మండలి తరపున సునుగురు సత్యం 9,500, ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి తరపున బండమీది గంగాధర్ 41,500, ముదిరాజ్ గణేష్ మండలి తరపున కుమ్మరి సాయిబాబా 23,500, కోనాపూర్ దండోరా గణేష్ మండలి తరపున జోగోల్ల బాలయ్య 10,100, సిద్ది వినాయక గణేష్ మండలి తరపున బింగి శంకర్ 23,000 లడ్డూ ప్రసాదాలను స్వీకరించారు. ఈ వేలం ద్వారా భక్తులు ప్రసాదాలను పొందారు.

సంబంధిత పోస్ట్