
'అందుకే నాకు భారత్ అంటే ఇష్టం'.. పోలండ్ మహిళ (వీడియో)
భారత్‌లో నివసిస్తున్న పోలండ్ మహిళ డొమినికా పాటలాస్, ఓ మెడికల్ షాపులో మర్చిపోయిన మందుల బ్యాగును 4 రోజుల తర్వాత భద్రంగా తిరిగి పొందిన సంఘటనపై భారతీయుల నిజాయితీని ప్రశంసించారు. ఇంత జనాభా ఉన్న దేశంలో 4 రోజుల తర్వాత కూడా తన వస్తువులను భద్రంగా ఉంచడం ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే భారత్‌పై మరింత ప్రేమను పెంచుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




