కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని భవిత కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ రకాల వైకల్యాలపై అవగాహన కల్పించి, విద్యార్థులకు ఉపయోగపడే సేవలు, ప్రయోజనాల గురించి వివరించారు. దివ్యాంగ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఆర్సి బృందం పాల్గొన్నారు.