బాన్సువాడలోని హన్మాజీపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ప్రసన్న మీనాను హాస్పిటల్ సిబ్బంది శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ, సేవలందిస్తున్న మీనా సేవలను సిబ్బంది కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ సత్యం, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.