
అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య.. 14 ఏళ్ల బాలుడి అరెస్ట్
తెలంగాణకు చెందిన 28 ఏళ్ల కుంచ అన్షుల్ అమెరికాలో హత్యకు గురైన కేసులో, ఫిలడెల్ఫియా పోలీసులు 14 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. జూలై 10న హత్య, దొంగతనం అభియోగాలపై అతడిని అదుపులోకి తీసుకున్నారు. జూన్ 5న నార్త్ ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీకి వెళ్లిన అన్షుల్‌పై దుండగులు కాల్పులు జరిపి, దొంగతనం కోసం దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన సమయంలో బాలుడితో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. 2023లో అమెరికా వెళ్లిన అన్షుల్, అదనపు ఆదాయం కోసం వారాంతాల్లో పిజ్జా డెలివరీ చేసేవాడని కుటుంబసభ్యులు తెలిపారు.




