బీర్కూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

7చూసినవారు
బీర్కూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
బీర్కూర్ గ్రామ కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహానికి గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజ, ఉప సర్పంచ్ పరమేష్ పంతులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ ధర్మ తేజ మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని అన్నారు. గాంధీజీ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్