తిరుమలాపూర్‌లో గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభ

0చూసినవారు
తిరుమలాపూర్‌లో గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభ
బాన్సువాడ మండలం, తిరుమలాపూర్ గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించి, గ్రామ అభివృద్ధి, ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోల్ల లక్ష్మి బాలయ్య, ఉపసర్పంచ్ మజ్జిగ జీవన్, వార్డు సభ్యులు, సెక్రటరీ అవినాష్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్