కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శుక్రవారం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో మహిళలు, యువకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణమంతా గణేషుని పాటలతో మారు మ్రోగింది. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.