
AP: విద్యార్థులకు శుభవార్త.. బడుల్లోనే ఉచిత ఆధార్ క్యాంపులు!
ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది. 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు తమ ఆధార్ బయోమెట్రిక్స్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం జులై 14 నుంచి 17 వరకు, ఆ తర్వాత 21 నుంచి 24 వరకు స్కూళ్లల్లో ప్రత్యేక ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్లలో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేట్, వివరాల మార్పులు ఉచితంగా చేసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ కోసం ప్రస్తుతం ఉన్న ఆధార్, కొత్త ఆధార్ కోసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు అవసరం.




