బాన్సువాడ టీచర్స్ కాలనీలోని దుర్గామాత మండపం వద్ద కొన్ని పార్టీల ఆధిపత్యం కోసం ఇతర మతస్తుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ లబ్ధి కోసం అమ్మవారి మండపం వద్ద ఇలా చేయడం సరికాదని, సనాతన ధర్మాన్ని గౌరవించాలని ప్రజలు, భక్తులు కోరుతున్నారు. రాజకీయ నాయకులు మతపరమైన అంశాలను తమ స్వార్థానికి వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.