కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సంగోజీపేట గ్రామ శివారులో రైతులు సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న, జొన్న పంటలను గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ పరిశీలించారు. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు వ్యాప్తిని నివారించడానికి వేప నూనె స్ప్రే చేయాలని రైతులకు సూచించారు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. సొసైటీ గోదాంలో యూరియా అందుబాటులో ఉందని, పి.యం.కిసాన్ సమ్మన్ నిధి డబ్బులు రాని రైతులు ఇ-కెవైసి, రైతు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి చైర్మన్, రైతులు పాల్గొన్నారు.