బాన్సువాడలోని శాంతినగర్ కు చెందిన నీరుడు సాయిలు (51) ఈ నెల 29న ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, తెలిసిన వారి ఇళ్లలో వెతికినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. కుటుంబీకులు గురువారం బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సాయిలు వెళ్ళినప్పుడు గోధుమ రంగు షర్టు, కాఫీ కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. అతని ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.