కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని SRNK ప్రభుత్వ డిగ్రీ & పిజి కళాశాలలో సెప్టెంబర్ 29న మెగా జాబ్ మేళా జరగనుంది. TSKC, IQAC, ప్లేసెమెంట్ సెల్, మరియు Magic Bus సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాలో SSC నుండి డిగ్రీ వరకు అర్హత గల వారికి ఉద్యోగావకాశాలు కల్పించబడతాయి. 22కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాలో రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు జీతం అందించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందూర్ గంగాధర్ తెలిపారు. అర్హులైన వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.