బాన్సువాడ పట్టణంలో మలిదశ ఉద్యమకారుడు, జర్నలిస్ట్ దండు విజయ్ కుమార్ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో మంగళవారం బారాస నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్న గారి జీవన్ రెడ్డిలు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత జర్నలిస్ట్ విజయ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.