బాన్సువాడ రూరల్ మండలంలోని బొర్లం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి భారత రాష్ట్ర సమితి నాయకులు నిరసన తెలిపారు. పార్టీ పేరుపై గెలిచి, ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, అంగన్వాడీ భవనాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారని వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని నిరసనకారులను అరెస్టు చేశారు.