విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో బీర్కూర్‌లోని సన్‌రైజ్ స్కూల్‌లో విశ్వ తేజస్ ట్రైనింగ్ & కౌన్సెలింగ్ సర్వీసెస్ సహకారంతో “ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ – 21వ శతాబ్దపు నైపుణ్యాలు” అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు శ్రీహరి, తిరునగరి విద్యార్థులకు పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వేదికపై ధైర్యంగా మాట్లాడే నైపుణ్యాలపై శిక్షణ అందించారు.