బాన్సువాడలో పెట్రోల్ బంకుల వద్ద వాహనాల బారులు

1153చూసినవారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోలు, డీజిల్ దొరకదనే వదంతులు, ధరలు పెరుగుతాయనే ప్రచారంతో ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కొన్ని పెట్రోల్ బంకులు ఆన్లైన్ చెల్లింపులకు బదులుగా నగదు చెల్లింపులను మాత్రమే స్వీకరించడం గమనార్హం.