తిరుమలాపూర్‌లో వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

1చూసినవారు
తిరుమలాపూర్‌లో వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం, తిరుమలాపూర్ గ్రామంలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుడ్మి పీఏసీఎస్ చైర్మన్ గంగుల గంగారం, వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గురువారం  ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మజ్జిగ జీవన్, మాజీ సర్పంచ్ రఘురామయ్య, గోల్ల బాలయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్