మాలలకు న్యాయం చేయాలని మంత్రికి వినతి

1చూసినవారు
మాలలకు న్యాయం చేయాలని మంత్రికి వినతి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ కు చెందిన రాష్ట్ర మాల నాయకులు అయ్యాల సంతోష్ ఆదివారం హైదరాబాద్ లో రాష్ట్ర ఉపాది శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో మాలలకు కేటాయించిన రోస్టర్ పాయింట్ 22 వల్ల విద్యా ఉద్యోగాల్లో నష్టం జరుగుతోందన్నారు. రోస్టర్ పాయింట్ 12 లోపు ఉండేలా చూడాలని కోరారు. రిజర్వేషన్ అయిదు శాతం నుండి 8 శాతానికి పెంచాలని మాలలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్