పాము కాటుతో మృతి చెందిన రైతు కుటుంబానికి రూ. 10 లక్షల బీమా పరిహారం

0చూసినవారు
పాము కాటుతో మృతి చెందిన రైతు కుటుంబానికి రూ. 10 లక్షల బీమా పరిహారం
బాన్సువాడ మండలం, తిరుమలాపూర్ గ్రామానికి చెందిన రాజు గత ఏడాది పాము కాటుతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో, SBI General Insurance ద్వారా మంజూరైన రూ. 10 లక్షల బీమా పరిహారాన్ని మంగళవారం ఎస్‌బీఐ మేనేజర్ చేతుల మీదుగా రాజు తల్లి భూమవ్వకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాసని శ్రీనివాస్ రెడ్డి, ఎనుగు రవీందర్ రెడ్డి అనుచరుడు దుబాయ్ సాయిలు, ఎస్‌బీఐ సిబ్బంది పాల్గొన్నారు. కుటుంబానికి బీమా పరిహారం అందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్