
బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్ కన్నుమూత
బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ (65) తల్లి పర్వీన్ ఖాన్ అనారోగ్యంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆర్గాన్ ఫెయిల్యూర్తో బాధపడుతున్న ఆమె మరణంతో జరీన్ ఖాన్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.




