కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం రైతునగర్ లో VB-G RAM G నిధులు రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘ భవనాన్ని, రూ. 30 లక్షలతో నిర్మించిన ఆహార ధాన్యాల నిల్వ భవనాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , రాష్ట్ర మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఆర్డీవో రవీందర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.