కామారెడ్డి జిల్లా, పెద్ద కొడపగల్ మండల స్థాయిలో జరిగిన హిందీ వ్యాస రచన పోటీలో కాటేపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని తబుసుం మండల టాపర్గా నిలిచింది. బుధవారం,
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ ఆమెను ఘనంగా సన్మానించి, రూ. 1,100 నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. విద్యార్థిని ప్రతిభకు ప్రోత్సాహం అందించిన పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు సునీతను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.