
భారీ ఆఫర్లను ప్రకటించిన జియో మార్ట్
రిలయన్స్ సంస్థకు చెందిన జియోమార్ట్, నవంబర్ నెలలో 'వింటర్ సేవింగ్స్ కార్నివల్' పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా పాలు, టీ, బ్రెడ్, కిచెన్ సామాగ్రి, డిటర్జెంట్లు, క్రీములు, పిండి వంటి అనేక నిత్యావసర వస్తువులపై 50% వరకు తగ్గింపు అందిస్తోంది. నవంబర్ 1 నుండి 7 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఫాస్ట్ డెలివరీ, లో ప్రైస్ గ్యారంటీతో పాటు ఉచిత హోమ్ డెలివరీని జియోమార్ట్ అందిస్తోంది.




