
పీఎఫ్ ఖాతా ఉంటే.. అకౌంట్లోకి రూ.15 వేలు
ప్రభుత్వ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. విద్య పూర్తయిన తర్వాత తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఉద్యోగికి పీఎఫ్ ఖాతా ఉండాలి, ఈపీఎఫ్వో ద్వారా కాంట్రిబ్యూట్ చేయాలి. పథకం ద్వారా లబ్ధి పొందాలంటే జీతం రూ.లక్ష కంటే తక్కువగా ఉండాలి. ఉద్యోగం కల్పించినందుకు కంపెనీలకు కూడా రూ. వెయ్యి నుంచి రూ.3 వేల వరకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. 2025 ఆగస్టు 1 నుంచి జులై 31, 2027 మధ్య కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈ పథకం వర్తిస్తుంది.




