
సౌదీ యువరాజుతో చర్చించిన ప్రధాని మోదీ
సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, ఇంధన సంస్థలపై దాడులు, సముద్ర భద్రత వంటి అంశాలపై చర్చించారు. సౌదీ అరేబియాలోని భారతీయుల సంక్షేమానికి అందిస్తున్న మద్దతుకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ప్రాంతీయ ఇంధన సంస్థలపై దాడులను ఖండించిన మోదీ, సముద్ర వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.




