
28ఏళ్ల దివ్యాంగురాలిపై 40ఏళ్ల వ్యక్తి అత్యాచారం
TG: హైదరాబాద్లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 28 ఏళ్ల దివ్యాంగురాలైన యువతిపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలు మూగ, బధిర కావడంతో సంకేతాల ద్వారా కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.




